వైట్లకు మరో ఛాన్స్‌ వచ్చినట్లే

Srinu Vaitla Next Movie With Ravi Teja

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Srinu Vaitla Next Movie With Ravi Teja

‘దూకుడు’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌ డైరెక్టర్‌ అయిన శ్రీనువైట్ల ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు. ‘బాద్‌షా’, ‘ఆగడు’, ‘బ్రూస్‌లీ’, ‘మిస్టర్‌’ ఇలా శ్రీనువైట్ల చేసిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. మాములుగా ఒక దర్శకుడికి రెండు లేదా మూడు సినిమాలు ఫ్లాప్‌ అయితేనే అవకాశాలు రావు. కాని శ్రీనువైట్ల అదృష్టమో లేక మరేమో కాని అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ‘బ్రూస్‌లీ’ చిత్రం తర్వాత శ్రీనువైట్ల కెరీర్‌ ముగిసిపోయినట్లే అనుకుంటుండగా మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో ‘మిస్టర్‌’ చేసే అవకాశం దక్కింది.

‘మిస్టర్‌’పై చాలా అంచనాలు పెట్టుకున్నారు. అంచనాలకు ఏమాత్రం ఆ సినిమా చేరుకోలేదు. పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో ఇక శ్రీనువైట్ల సర్దేసుకోవాల్సిందే అన్నారు. వెండి తెరను వదిలి బుల్లి తెర కోసం యూట్యూబ్‌ సిరీస్‌లను శ్రీనువైట్ల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని మరోసారి శ్రీనువైట్లకు ఆశ్చర్యకరంగా ఆఫర్‌ వచ్చింది. శ్రీనువైట్ల, రవితేజల కాంబినేషన్‌కు రంగం సిద్దం అయ్యింది. నిన్న మొన్నటి వరకు రామ్‌తో ‘ఢీ’ సీక్వెల్‌కు సిద్దం అవుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు రవితేజతో శ్రీనువైట్ల సినిమా చేయనున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం ‘రాజా ది గ్రేట్‌’, ‘టచ్‌చేసి చూడు’ చిత్రాలు చేస్తున్న రవితేజ ఆ తర్వాత శ్రీనువైట్లతో సినిమాను చేయబోతున్నాడు. శ్రీనువైట్ల ఈ ఆఫర్‌ను అయిన సద్వినియోగం చేసుకుంటుందేమో చూడాలి.

మరిన్ని వార్తాలు :

అబద్ధం మీద అంతులేని నమ్మకం.

సక్సెస్‌ క్రెడిట్‌లో 90% ఆయనదే