Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇటీవల కాస్టింగ్ కౌచ్ విషయమై టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అవకాశాలకోసం వచ్చే అమ్మాయిలను, మరీ ముఖ్యంగా తెలుగు అమ్మాయిలను కొందరు సినిమా వాళ్ళు సినిమా అవకాశాల పేరుతో లైంగికంగా వేధిస్తున్నారని ఏకంగా ఒక ఉద్యమమే మొదలుపెట్టగా ఆమె ఉద్యమానికి కొందరు మద్దతు పలికారు. తొలుత పవన్ కళ్యాణ్ మీద అసభ్య వ్యాఖ్యలు చేసిన ఆమె గత కొద్దికాలంగా నేచురల్ స్టార్ నానీ మీద దారుణమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నాని తనను గతంలో లైంగిక వేధింపులకు గురిచేసాడని ఆరోపించింది. అంతే కాదు తనకు బిగ్ బాస్-2 లో ఛాన్స్ రాకుండా కూడా అడ్డుకుంది నానియే అని, ఇండస్ట్రీలో ప్రస్తుతం కుల రాజకీయాలు నడుస్తున్నాయి. కేవలం రెండు సామజిక వర్గాలలో ఒక ముఖ్య సామజిక వర్గానికి చెంది ఉండడంవల్ల నానికి అవకాశాలు వస్తున్నాయని ఆమె ఆరోపించారు. బిగ్‌బాస్2 కార్యక్రమం ఆదివారం రాత్రి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాని సదరు హీరోయిన్‌పై ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు.
వారిలా నేను దిగజారుడు మాటలు మాట్లాడలేను. వారికి దిగజారుడు పద్దతిలో స్పందించలేను. వాళ్లు కోరుకొన్నట్టుగా వారికి ఏదీ ఇచ్చుకోలేను. వారు చేస్తున్న దిగజారుడు ఆరోపణలకు ధీటుగా లీగల్ చర్యలు తీసుకొంటాను. పరువు నష్టం కేసు కింద వారికి లీగల్ నోటీసులు వెళ్లాయి అని నాని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తూ సాఫ్ట్ టార్గెట్ చేస్తున్న వైనం తనను ఇబ్బంది పెట్టిందని, అయినా తన ఆందోళన తన కోసం కాదని, మనం నివసించే సొసైటీ కోసమని నాని తెలిపారు. ఏదో ఇష్టం వచ్చినట్టుగా కొందరిని టార్గెట్ చేస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేయడం దారుణం. వారి ప్రతిష్ఠకు భంగం వాటిల్లే విధంగా అవాస్తవాలను ప్రచారం చేయడం నాన్‌సెన్స్. అలాంటి చర్యల ద్వారా నన్ను వేధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. డిస్టర్బ్ చేస్తున్నారు అని నాని ట్విట్టర్‌లో వెల్లడించారు.
నా మీద చేస్తున్న దాడికి నేను ఆందోళన చెందడం లేదు. నా భయమంతా సమాజం గురించి, అందులో జీవిస్తున్న ప్రతీ ఒక్కరి గురించి మాత్రమే. ఏదో అవాస్తవాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం, ఆ చెత్తనంతా కొందరు కొన్ని క్లిక్స్ కోసం పబ్లిష్ చేయడం దారుణం. ప్రతీ ఒక్కరికి కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్నీ ఆరోపణలు చేసినా నేను పట్టించుకోను. ఇకపై కూడా ఎలాంటి చెత్తపై నేను కామెంట్ కూడా చేయను. సహనానికి ఓ హద్దు ఉంటుంది అని నాని అన్నారు. సామాజిక మాద్యమాల్లో ఓ హీరోయిన్ తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పరువుకు భంగం కలిగిస్తుందంటూ తన న్యాయవాది ద్వారా నాని నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో నోటీసులు అందిన ఏడు రోజుల్లోగా సదరు నటి సిటీ సివిల్ కోర్టుకు సమాధానం ఇవ్వాలని నాని తరుపు న్యాయవాదులు సూచించినట్టు సమాచారం. నాని వివరణ మరియు శ్రీరెడ్డిపై పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన కేసుకు సంబంధించిన పేపర్లు నాని ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అవి వెంటనే వైరల్ గా మారాయి. అయితే నాని పోస్టు చేసిన లీగల్ నోటీసుకు సంబంధించిన దానికి శ్రీరెడ్డి తిరుగు జవాబిచ్చింది. తప్పుకుండా మనం లీగల్‌గా ఫైట్ చేద్దాం అని నానీ ట్వీట్‌ను రీట్వీట్ చేయడం కొసమెరుపు.