నెచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 విడుదలై మంచి విజయం అందుకుంది. ముఖ్యంగా ఇందులో నాని, సాయి పల్లవిల కెమిస్ట్రీ అదిరిపోయిందనే రెస్పాన్స్ వచ్చింది. మొదటి నాలుగు రోజులు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆ తర్వాత కాస్తా స్లో అయింది. శ్యామ్ సింగరాయ్ కలెక్షన్స్ ఆశించినంత రాబట్టేలేకపోయాయి.
తెలంగాణలో ఈ మూవీ బాగానే ఆడినా.. ఏపీలో కొన్ని థియేటర్లు మూత పడటంతో అక్కడ కలెక్షన్స్‌పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో అక్కడ శ్యామ్ సింగరాయ్ తక్కువే బిజినెస్ చేసిందని చెప్పాలి. అయితే ప్రారంభంలో ఈ మూవీకి ఆశించిన వసూళ్లు రావడంతో శ్యామ్ సింగరాయ్ సేఫ్ జోన్‌కు వచ్చేసింది. ఇప్పటివరకు 24.80 కోట్ల షేర్ వసూలు చేయగా.. రూ. 22.50 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.