నాని, త్రివిక్రమ్‌… ఔను నిజమే!

Nani to act in Trivikram direction

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
యువ హీరో నానితో సినిమాలు చేసేందుకు స్టార్‌ నిర్మాతలతో పాటు, స్టార్‌ దర్శకులు కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న నాని త్వరలోనే ఒక సంచలన చిత్రానికి ఓకే చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నాని హీరోగా ఒక చిత్రం తెరకెక్కే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఆ విషయం నిజమే అన్నట్లుగా నిర్మాత రాధాకృష్ణ అనధికారికంగా క్లారిటీ ఇచ్చాడు. ఇటీవలే నానికి రాధాకృష్ణ 50 లక్షల మేరకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఆ తర్వాత వెంటనే నాని హీరోగా అదే నిర్మాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి దర్శకుడు త్రివిక్రమ్‌తో ఎంతో మంది స్టార్‌ హీరోలు సినిమాలు చేయాలని కోరుకుంటుండగా ఆ అవకాశం నానికి దక్కింది. ఈ చిత్రం చేస్తే నాని రేంజ్‌ మరింతగా పెరగడం ఖాయం. ప్రస్తుతం నాని రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. వచ్చే సంవత్సరం ఆరంభంలో నాని, త్రివిక్రమ్‌ల మూవీ పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఈ చిత్రం గురించిన పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.