రీమేక్‌కు నాని సై అన్నట్లేనా…?

Nani Wants To Remake 96 Movie Under Dil Raju Banner

నాని తాజాగా ‘దేవదాస్‌’ చిత్రంలో నటించాడు. నాగార్జునతో కలిసి నటించిన ఆ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రంపై నాని చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇక నాని తదుపరి చిత్రం విషయంలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. నాని తమిళంలో రూపొంది, భారీ అంచనాల నడుమ వచ్చే నెల 4న విడుదల కాబోతున్న ‘96’ చిత్రం రీమేక్‌లో నటించబోతున్నాడు. గతంలో నాని నటించిన రెండు రీమేక్‌ చిత్రాలు అంతగా అలరించలేక పోయాయి. దాంతో నాని రీమేక్‌లపై ఆసక్తి చూపించలేదు. దాదాపు అయిదు ఏళ్ల తర్వాత మళ్లీ నాగార్జున రీమేక్‌కు ఓకే చెప్పాడు.

dill-raj

విజయ్‌ సేతుపతి మరియు త్రిష కలిసి నటించిన ‘96’ చిత్రం రీమేక్‌ రైట్స్‌ను దిల్‌రాజు దక్కించుకున్నాడు. మొదట డబ్బింగ్‌ రైట్స్‌ను కొనుగోలు చేసిన దిల్‌రాజు డబ్‌ చేసి విడుదల చేయాలని భావించాడు. కాని సినిమా చూసిన తర్వాత డబ్బింగ్‌ కంటే రీమేక్‌ చేస్తేనే బెటర్‌ అంటూ దిల్‌ రాజు భావించాడు. దాంతో దిల్‌రాజు ‘96’ చిత్రం కథను నానికి చెప్పి అతడి అభిప్రాయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రీమేక్‌కు నాని దాదాపుగా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. తమిళంలో ఈ చిత్రం సక్సెస్‌ అయితే తెలుగు రీమేక్‌ పనులు వెంటనే మొదలయ్యే అవకాశం ఉంది.

nani