పిక్‌టాక్‌ : ఇది ఎన్టీఆర్‌ అంటే…!

ntr-movies

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ డౌన్‌ టు ఎర్త్‌ అంటూ అంతా అంటూ ఉంటారు. తాను ఒక స్టార్‌ను అనే ఫీలింగ్‌ లేకుండా తన సన్నిహితుల వద్ద ప్రవర్తిస్తాడు అంటూ గతంలో పలు సార్లు నిరూపితం అయ్యింది. షూటింగ్‌ సమయంలో అందరితో కలిసి ఉండటం, అందరితో పాటు కలిసి తినడం చేస్తాడట. ఇక విదేశాల్లో షూటింగ్స్‌ అంటే అందరు ఉన్నట్లుగా సాదా సీదా హోటల్‌ గదుల్లో ఉండేందుకు కూడా ఎలాంటి అభ్యంతరం పెట్టడు అంటూ ఆయన గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు. ఇతర హీరోలకు కార్‌వాన్‌ు, స్పెషల్‌ రూంలు ఉంటాయి. కాని ఎన్టీఆర్‌ ఔట్‌డోర్‌ షూటింగ్‌కు వెళ్లినప్పుడు అలాంటి పట్టింపులు లేకుండా ఉంటాడు.

ntr-movie-aravindha-sametha

విదేశాల్లో చిత్రీకరణకు వెళ్లిన సమయంలో అందరు ఎలా ఉంటే ఎన్టీఆర్‌ కూడా అలాగే ఉంటాడు. ఆ విషయం మరోసారి నిరూపితం అయ్యింది. ప్రస్తుతం ‘అరవింద సమేత’ చిత్రం షూటింగ్‌ కోసం విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్‌కు సంబంధించిన ఈ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్‌ ఒక సాదారణ వ్యక్తిలా చెట్టు కింద నేల మీద కూర్చుని ఉన్నాడు. షూటింగ్‌ గ్యాప్‌లో ఎన్టీఆర్‌ ఇలా రెస్ట్‌ తీసుకుంటున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. త్వరలో చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే నెల దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.

ntr-movie