‘ఆర్‌ఎక్స్‌ 100’ జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది

Bollywood Remake Right Of RX100

కార్తికేయ, పాయల్‌ రాజ్‌ పూత్‌ జంటగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆ చిత్రం 20 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. దానికి తోడు ఈ చిత్రం అన్ని భాషల్లో భారీ మొత్తానికి అమ్ముడు పోతుంది. ఇప్పటికే తమిళం మరియు మలయాళంలో దాదాపు 50 లక్షల చొప్పున అమ్ముడు పోయిన ఈ చిత్రం హిందీ రీమేక్‌ రైట్స్‌తో భారీ మొత్తంను దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

rx 100 movie collections

వర్మ మెచ్చిన సినిమా అవ్వడంతో ఆయన రికమండేషన్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్ర రీమేక్‌ రైట్స్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ చిత్రం దాదాపుగా 1.6 కోట్లకు అమ్ముడు పోయినట్లుగా తెలుస్తోంది. హిందీలో ఈ చిత్రం రీమేక్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే తమిళంలో ఆది పినిశెట్టి హీరోగా రీమేక్‌ మొదలు అయ్యింది. మలయాళంలో కూడా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. త్వరలోనే హిందీలో కూడా ఈ రీమేక్‌ పట్టాలెక్కే అవకాశం ఉంది. మొత్తానికి రీమేక్‌ రైట్స్‌ ద్వారా సినిమా బడ్జెట్‌ కంటే ఎక్కువగా నిర్మాత దక్కించుకున్నాడు. అంటే వచ్చిన కలెక్షన్స్‌ అన్నీ కూడా లాభాలే. చిన్న చిత్రంతో సంచలన విజయాన్ని దక్కించుకున్న నిర్మాతకు లాభాలే లాభాలు.