కృష్ణార్జున యుద్దంపై నాని అసంతృప్తి

Nani wants to Reshoot Krishnarjuna Yuddham movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
వరుస విజయాలతో ఈతరం హీరోలకు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్న నాని ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంతో నాని మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటూ నిన్న మొన్నటి వరకు అంతా భావించారు. అయితే నానికి ఈ చిత్రం చేదు ఫలితం ఇచ్చేలా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ విషయం ఇప్పటికే నానికి కూడా తెలిసిందని, తాజాగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న కృష్ణార్జున యుద్దం చిత్రం టీజర్‌ మరియు పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే సినిమా పూర్తి రషెష్‌ చూసిన నాని మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.

రెండు విభిన్న పాత్రలో నాని కనిపించబోతున్నాడు. స్క్రీన్‌ప్లే పరంగా రెండు పాత్రలకు సమాన న్యాయం ఉంటుందని దర్శకుడు గాంధీ మొదట చెప్పాడట. అయితే చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత చూస్తే ఒక పాత్రకు ఏమాత్రం ప్రాముఖ్యత లేదని, ఆ పాత్ర నాని చేయకుంటే బాగుండేది అనే అభిప్రాయంను ప్రేక్షకులు వ్యక్తం చేస్తారని కొందరు అంటున్నారట. నానికి కూడా అదే అనిపిస్తుందని, దాంతో ఆ పాత్రకు సంబంధించిన కొన్ని సీన్స్‌ను మళ్లీ చిత్రీకరించాలని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే డేటు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు రీ షూట్‌ అంటే సినిమా విడుదల ఆలస్యం అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. అయినా కూడా నాని సలహా మేరకు రీ షూట్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు మేర్లపాక గాంధీ కూడా రీ షూట్‌ ఏర్పాట్లు మొదలు పెట్టాడు. వచ్చే నెలలో విడుదల అయ్యేలా రీ షూట్‌ను చకచక జరపాలని భావిస్తున్నారు.