బాబోయ్‌… ఈమె సీతమ్మేనా?

Anjali New Look

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగమ్మాయి అంజలి ‘జర్మీ’ మరియు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలతో ఏ స్థాయిలో గుర్తింపు దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో పాటు ఆ తర్వాత నటించిన బలుపు, గీతాంజలి చిత్రాల్లో అంజలి మోతాదుకు మించి బరువు పెరిగిన విషయం తెల్సిందే. తెలుగులో పెద్దగా సక్సెస్‌లు లేకపోవడంతో ఈ అమ్మడు కోలీవుడ్‌కు పరిమితం అయ్యింది. ఈ సమయంలోనే ఈమె తాజా లుక్‌ అందరికి షాకింగ్‌గా ఉంది. గత కొన్ని నెలలుగా పూర్తిగా మీడియాకు దూరం అయిన అంజలి ఉన్నట్లుండి కొత్త లుక్‌తో షాకిచ్చింది. సోషల్‌ మీడియాలో తాజాగా ఈమె పోస్ట్‌ చేసిన ఫొటో ఒకటి వైరల్‌ అవుతుంది.

గత ఏడాది వరకు 60 నుండి 65 కేజీల వరకు బరువు ఉన్న అంజలి ఉన్నటుండి 50 కేజీల లోపు బరువుకు వచ్చేసింది. తమిళ ఆడియన్స్‌ బొద్దుగుమ్మలను ఇష్టపడతారు. అయినా కూడా అంజలి తన కొత్త సినిమా కోసం భారీగా బరువు తగ్గింది. ప్రస్తుతం అంజలి చాలా స్లిమ్‌గా, అందంగా ఉందని సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది. బక్కపల్చగా కనిపిస్తున్న అంజలిని తెలుగులో పలువురు హీరోు బుక్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. త్వరలోనే తెలుగులో రెండు చిత్రాలతో ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరో వైపు తమిళంలో ఈమెకు చేతినిండా సినిమా ఆఫర్లు ఉన్నాయి. మొత్తానికి బొద్దుగా ఉండే సీతమ్మ బక్కగా అయ్యి అందరికి షాక్‌ ఇచ్చింది.