టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఉద్దేశించి పలు వాఖ్యలు చేశారు. కాగా ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఉల్లి ధరలు బాగా పెరిగాయని, ఉల్లి ధరలు మరీ ఇంతలా పెరగడం తాను ఎన్నడూ చూడలేదని నారా భువనేశ్వరి తెలిపారు. ఇకపోతే సీఎం జగన్ ఇటీవల చేసిన వాఖ్యలపై స్పందించిన భువనేశ్వరి… సీఎం జగన్ నిన్న చర్చలో మాట్లాడుతూ, చందబ్రాబు తన హెరిటేజ్ ఫ్రెష్ ద్వారా ఉల్లిపాయలను కిలో రూ.200 కి అమ్ముతున్నారని ఆరోపించారు. అయితే హెరిటేజ్ సంస్థ తో తమకు ఎ లాంటి సంబంధం లేదని, అది ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ఆధీనంలోకి వస్తుందని వెల్లడించారు.
కాగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు సతీమణి మాట్లాడుతూ… ఇటీవల కాలంలో పెరిగిన ఉలి ధరల వలన పేద, దిగువ, మధ్య తరగతి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని, ఒక గృహిణిగా తాను కూడా ఉల్లి విషయంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నానని వెల్లడించారు. ఇకపోతే పెరిగిన ఉల్లి ధరలను తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని నారా భువనేశ్వరి సూచించారు.