టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ రైతులకు మద్ధతుగా విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షాస్థలి వద్దకు వెళ్ళి తిరిగి వస్తుండగా కనకదుర్గమ్మ వారధి వద్ద లోకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే రైతులకు మద్దతుగా చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్భందంలో పాల్గొనేందుకు వెళ్తున్నారని అందుకే లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే తాను పార్టీ ఆఫీసుకు వెళ్తున్నానని లోకేశ్ చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోకుండా ఆయనను అరెస్ట్ చేశారని టీడీపీ అనుచరులు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. అయితే లోకేష్‌తో పాటు అదే వాహనంలో ప్రయాణిస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను, నిమ్మల రామానాయుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని తోట్ల వల్లూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం.