ఇవాళ ఏపీకి రానున్న నారా లోకేష్‌..

Nara Lokesh is going to Delhi today..!
Nara Lokesh is going to Delhi today..!

నేడు ఏపీకి రానున్నారు టీడీపీ అగ్రనేత నారా లోకేష్‌. ఇవాళ సాయంత్రం ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు టీడీపీ అగ్రనేత నారా లోకేష్. గన్నవరం నుండి నేరుగా రోడ్డు మార్గం గుండా రాజమండ్రి వెళ్ళనున్న నారా లోకేష్….రేపు ఉదయం మలాకత్ లో చంద్రబాబును కలవనున్నారు నారా లోకేష్. కాగా, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

అయితే.. నేటితో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ ముగియనుంది. అక్టోబర్‌ 5 తేదీ వరకు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏసీపీ కోర్టు రిమాండ్‌ గత నెలలో విధించింది. అయితే.. నేటితో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ ముగియనుంది. ఇక ఇవాళ రిమాండ్ పొడిగింపుపై ఆదేశాలు ఏసీబీ కోర్టు ఇవ్వనుంది . వర్చువల్ విధానంలో చంద్రబాబుని ఏసీబీ జడ్జి ముందు అధికారులు ప్రవేశ పెట్టనున్నారు . చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని కోరుతూ నేడు సీఐడీ మెమో ఫైల్ చేయనుంది.