తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని కోసం స్వచ్చందంగా భూములు ఇచ్చిన రైతుల్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చంపేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ దున్నపోతు ప్రభుత్వం అక్రమ కేసులతో రైతుల్ని బలి తీసుకుంటుందని అన్నారు. రాజధాని తరలింపు ఆందోళనలో రైతుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపణలు చేసారు.
శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టడం వలన పలువురు రైతులు మృతి చెందిన విషయాన్నీ నారా లోకేష్ ప్రస్తావించారు. ఈ సంఘటనలు తనని తీవ్రంగా కలచి వేశాయని అన్నారు. రైతులకి ఈ పరిస్థితి రావడం దారుణమని అన్నారు. చేసేవి దొంగ పనులు కాబట్టే పోలీసులని గ్రామాల్లో వేల సంఖ్యలో దింపారని జగన్ ప్రభుత్వం ఫై విమర్శలు చేసారు. ప్రజల మధ్యలో నుండి కాకుండా జగన్ దొంగ దారిలో వెళ్లేందుకు కొత్త రోడ్డు ఏర్పాటు చేసుకున్నారని ధ్వజమెత్తారు.