దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) 2019 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ఖచ్చితంగా మంచి మార్కులే సాధిస్తారు. జాతీయ స్థాయి ర్యాంకులు ఒకేసారి విడుదల అవుతాయి కాబట్టి విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశముంది.. ఫీజులు ఎలా ఉంటాయి.. మొదలైన సమాచారం తెలుసుకోవడంలో తలమునకలవుతున్నారు. ఈ ఫలితాలు వచ్చిన వెంటనే ఆల్ ఇండియా కోటాకు కౌన్సెలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వైద్య కళాశాలలకు సంబంధించిన వివరాలు, ఫీజులు తెలుసుకునే పనిలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా సీట్లు ఇలా రెండు విదాలుగా ఉన్నాయి. అదే తెలంగాణాలో కూడా అక్కడి కాలేజ్ లలో ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా సీట్లు ఉంటాయి. ఇప్పుడు ఏపీలో ప్రైవేట్ కళాశాలలో అగ్రగామిగా నిలుస్తున్న నారయణ మెడికల్ కాలేజ్ గురించి చూస్తే ఈ కాలేజ్ ఏపీలో ఉన్న అన్ని కాలేజ్ ల కంటే రెండింతల ఎంబీబీఎస్ సీట్లు ఆఫర్ చేస్తోంది. ఏపీ తెలంగాణాలలో ఉస్మానియా మెడికల్ కాలేజ్ తో పాటు నారయణ కాలేజ్ మాత్రమే అన్ని సీట్లు ఆఫర్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో తన సత్తా చాటుతోంది.