పంజాబ్‌ పర్యటన రద్దు

పంజాబ్‌ పర్యటన రద్దు

ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పంజాబ్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. సెక్యూరిటీ కారణాలే అంటూ కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దీంతో పంజాబ్‌లో జరగాల్సిన ప్రధాని మోదీ ర్యాలీ రద్దయింది. సెక్యూరిటీ లోపాలే కారణామని కేంద్ర హోంశాఖ ప్రకటన జారీ చేసింది.

భఠిండా నుంచి రోడ్డు మార్గాన ఫిరోజ్‌పూర్‌ వస్తుండగా ఓ ఫ్లై ఓవర్‌ వద్ద నిరసనకారులు ట్రక్కులు అడ్డుపెట్టి రోడ్డును బ్లాక్‌ చేశారని తెలిపింది. అక్కడే ప్రధాని 15 నుంచి 20 నిమిషాలు వేచి చూశారని పేర్కొంది. ఆ తర్వాత ప్రధాని మోదీ వెనుదిరిగి భఠిండా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిపోయారుని తెలిపింది. భద్రతా లోపాలపై వెంటనే నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ పంజాబ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కాగా, ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని మోదీ హెలికాప్టర్‌లోకాకుండా భఠిండా నుంచి రోడ్డు మార్గంలో ఫిరోజ్‌పూర్‌ బయల్దేరారు. ప్రస్తుతం ఫిరో్‌పూర్‌లో భారీ వర్షం కురుస్తోంది. ర్యాలీకి హాజరైన ప్రజలు కుర్చీలు, ప్లకార్డులు అడ్డుపెట్టుకుని ప్రధాని మోదీ రాకకోసం వేచిచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ రావడం లేదని కేంద్రమంత్రి మాండవీయ స్టేజ్‌పై ప్రకటించారు.