దేవుడి గడ్డ అయినా మోడీకి లెక్కలేదు !

narendra modi showing partiality on southern states

గాడ్స్ ఓన్ కంట్రీ అంటే దేవుడి సొంత దేశంగా కేరళను చెబుతుంటారు, అలాంటి పుణ్యభూమి మీద ప్రకృతి పగ బట్టింది. మనిషి అభివృద్ధి కోసం చేస్తున్న పనులని చూసి కోపం వచ్చో లేక మరింకేమైనానో కానీ కేరళను వరదలు అతలాకుతలం చేసాయి. తప్పులు చేయటం ప్రకృతి శిక్ష విధించటం లాంటి వాటిని ముందుగా పక్కన పెడితే కష్టం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ప్రధాని మోడీకి తెలీదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

 narendra modi
గత డెబ్బై సంవత్సరాలుగా ఎపుడూ చూడనంత వరదలు, కళ్ళముందు కూలిపోతున్న ఇళ్ళు, 35 డాముల షట్టర్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ముళ్ళపెరియార్ డాం ఐతే, 123 సంవత్సరాలలో మొదటిసారి గేట్లు ఎత్తాల్సి వచ్చింది. రోగాలు పెరుగుతున్నాయి. ఏదోవిధంగా హాస్పటల్ కి వెళితే అక్కడ సిబ్బంది పూర్తిగా ఉండడంలేదు. వాళ్ళూ వరదల్లోనే ఉన్నారు. కరెంటులేదు. జనరేటర్లు వాడుదామంటే డీజిల్ లేదు. మందులు లేవు. ఇంచుమించు రాష్ట్రంలోని 14 జిల్లాలూ వరదల్లోనే ఉన్నాయి. నీళ్ళు రావడంతో ఎయిర్ పోర్టు మూత పడింది. వందలమంది చనిపోయారు. లక్షలాదిమంది ఇంకా వరదల్లో ఆర్తనాదాలు చేస్తూనే ఉన్నారు.

narendra-modi
హెలికాఫ్టర్ నుండి జార విడిచే ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి మంత్రులు కళ్ళనీళ్ళు పెట్టుకునే పరిస్తితి వచ్చింది. దేశమంతా కదిలింది. ఎన్నో రాష్ట్రాలు స్పందించాయి. చివరకు యునైటెడ్ నేషన్స్ కూడా రెస్పాండ్ అయింది ఇలాంటి పరిస్తితుల్లో కూడా ఆ రాష్ట్రం నార్త్ లో ఉందా సౌత్ లో ఉందా మన పార్టీ అధికారంలో ఉందాలేదా..భవిష్యత్ లో వస్తుందా రాదా లాంటివి ఆలోచనలు అవసరమా ? గుజరాత్ లో రెండు జిల్లాలు వరదల్లో చిక్కుకుంటే తక్షణ సాయం 500 కోట్లు. ఇంత దారుణమైన పరిస్తితిలో ఉన్న కేరళకూ 500 కోట్లా ?

Inline image

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న ఒక యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ.కేరళ విలయంపై వారం ముందే తనవంతు సాయంగా రూ.5లక్షలను కేరళకు సాయంగా ఇచ్చాడు. అంతేనా తనను అభిమానించే వారందరిని కేరళకు సాయం చేయాలంటూ సోషల్ మీడియా ద్వారా వేడుకున్నాడు. ఒక రాష్ట్రానికి చెందినా నటుడు కేరళకు వచ్చిన కష్టానికి కదిలిపోయి రూ.5లక్షలు సాయంగా అందిస్తే.. దేశ ప్రధానమంత్రిగా ఉన్న మోడీ కేరళకు అందించాల్సిన సాయం ఎంత ఉండాలి? ఓపక్క కష్టాల సుడిగుండంలో చిక్కుకొని విలవిలలాడుతున్నవేళ.. కేంద్రం ప్రకటించిన సాయం వింటే ఒళ్లు మండిపోతోంది. రాష్ట్రాలు తమ ఆదాయంలో వాటాగా కేంద్రానికి ఇచ్చే మొత్తాన్ని కష్టంలో ఉన్న రాష్ట్రానికి అందించే విషయంలో అంత లెక్కలు కట్టి ఇచ్చేదేంటి ?

narendra modi
మోడీకి కళ్ళు పోయాయా ? అసలు ఈ లెక్కలేంటి మోడీ…అందుతున్న సమాచారం మేరకు ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళ కోలుకోలేనంతగా దెబ్బతింది. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టం రూ. 2 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో లక్ష కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. 16 వేల కిలోమీటర్ల మేర పీడబ్ల్యూడీ రోడ్లు, 82 వేల కిలోమీటర్ల మేర లోకల్ రోడ్లు దెబ్బతిన్నాయి. 134 వంతెనలు ధ్వంసమయ్యాయి. రోడ్లు, వంతెనల నష్టమే రూ. 13,800 కోట్లుగా ఉంటుందని చెబుతున్నారు. 40 వేల హెక్టార్లలో పంటనష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు 400 మంది ప్రాణాలు కోల్పోగా, 4 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మధ్య కేరళలోని త్రిస్సూర్, అలువా, ఇడుక్కి ప్రాంతాలు భారీగా దెబ్బతిన్నాయి.

modi
ఇలాంటి సమయంలో కేరళకు కేంద్రం అందించే తక్షణ సాయం రూ.100 కోట్లు ఏమిటి? ఏరియల్ సర్వే చేశాక దానికి అదనంగా ఒక ఐదు వందల కోట్లు ముష్టి విదిల్చినట్టు విదిల్చరా ? కేరళలోని చెంగనూరు ఎమ్మెల్యే కంటతడి పెడుతూ.. ప్రజల్ని కాపాడేందుకు హెలికాఫ్టర్లను వెంటనే రంగంలోకి దించాలన్న మాటను మీడియా ముందు వేడుకున్న వైనం చూస్తే కేరళ ఇప్పుడెంత కష్టంలో ఉందో తెలుస్తుంది. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అన్నటు మోడీ తలుచుకుంటే ఎంతసేపటిలో వారిని రక్షించవచ్చు. మోడీని అభిమానించి నెత్తిన ఎక్కించుకున్న వారే ఇప్పుడు మోడీ చేస్తున్న అర్చకం చూసి ఛీ మోడీ అంటున్నారు. ఇంతకనా దరిద్రం ఏమి కావాలి ?

narendra modi