పంజాబ్‌లో ఎన్నికల ప్రచారం

పంజాబ్‌లో ఎన్నికల ప్రచారం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14, 16, 17వ తేదీల్లో పంజాబ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన 14న జలంధర్‌లో, 16న పఠాన్‌కోట్‌లో, 17న అబోహర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు బుధవారం వెల్లడించాయి.

పంజాబ్‌లో ఈ నెల 20 అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మోదీ జనవరి 5న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్తుండగా, ఆ మార్గాన్ని రైతులు దిగ్బంధించడంతో ఆయన కాన్వాయ్‌ ఓ ఫ్లైఓవర్‌పై 15–20 నిమిషాలపాటు ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది.