త్వరలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అర్హులైన వారు భారత పౌరసత్వానికి అప్లై చేసుకునేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ‘CAA 2019’ పేరిట ఓ యాప్ ను తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ లేదా ‘Indiancitizenshiponline.nic.in’ యాప్ లో అందుబాటులో ఉందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్విటర్లో పేర్కొంది.
ఇదిలా ఉంటే….పౌరసత్వ సవరణ చట్టం-2019 కోసం త్వరలో అందుబాటులోకి తెచ్చే పోర్టల్లో పౌరసత్వం కోసం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం బాధితులను కోరింది.ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి.