National Politics: నేడు అయోధ్య ఆలయంపై లోక్‌సభలో చర్చ

National Politics: Discussion on Ayodhya Temple in Lok Sabha today
National Politics: Discussion on Ayodhya Temple in Lok Sabha today

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వివిధ అంశాలపై విపక్షాలు కేంద్రంపై ప్రశ్నలు సంధిస్తున్నాయి. పలు వివాదాస్పద అంశాలపై చర్చకు పట్టుబడుతున్నాయి. ఇక తాజాగా లోక్ సభలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణంపై చర్చ జరపాలని పలువురు ఎంపీలు కోరారు. ఈ మేరకు ఇవాళ లోక్‌సభలో ఈ అంశంపై చర్చ జరగనుంది.

బీజేపీ సీనియర్‌ నేత సత్యపాల్‌ సింగ్‌ రామ మందిర నిర్మాణం, రామ్‌లల్లా(బాల రాముడు) ప్రాణప్రతిష్ఠపై చర్చను ప్రారంభిస్తారని లోక్‌సభ సచివాలయం శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇదే అంశంపై చర్చను కోరుతూ శివసేన ఎంపీ శ్రీకాంత్‌ శిందే కూడా నోటీసు ఇచ్చారు. చర్చ సందర్భంగా అధికార పక్ష సభ్యులు రామ మందిర నిర్మాణాన్ని సాకారం చేశారంటూ ప్రధాని మోదీని ప్రశంసల్లో ముంచెత్తుతారని భావిస్తున్నారు. ఇవాళ్టితో బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి. మరోపక్క ముఖ్యమైన సభా వ్యవహారాల నేపథ్యంలో పార్టీకి చెందిన పార్లమెంటు ఉభయ సభల సభ్యులు నేటి సమావేశాలకు తప్పక హాజరుకావాలంటూ బీజేపీ విప్‌ జారీ చేసింది.