National Politics: ఎంపీగా పోటీకి సిద్దమవుతున్న మాజీ ఆల్‌రౌండ‌ర్..

National Politics: Former all-rounder preparing to contest as an MP.
National Politics: Former all-rounder preparing to contest as an MP.

యువరాజ్ సింగ్.. భారత క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు.ఆల్ రౌండర్ గా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ తో 2011 ప్రపంచకప్ ను భారత కు అందించి ఒక్కసారిగా హీరో అయిపోయాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కొన్ని లీగుల్లో మాత్రమే ఈ స్టార్ ప్లేయర్ కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే…. యువి ప్ర‌జాక్షేత్రంలో అడుగుపెట్టనున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ఎంపీగా యువ‌రాజ్ సింగ్ పోటీ చేస్తాడ‌ని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. బీజేపీ త‌ర‌ఫున గురుదాస్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి యూవీ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

తాజాగా యువీ త‌ల్లి ష‌బ్నమ్ సింగ్‌తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్క‌రీని క‌లిశాడు. దాంతో, అత‌డు రాజ‌కీయాల్లో అరంగేట్రం చేయ‌నున్నాడనే వార్త‌లు నేట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. యువ‌రాజ్ మాత్రం ఈ వార్తలపై ఇంకా స్పందించ‌లేదు.గురుదాస్‌పూర నుంచి బాలీవుడ్ కి చెందిన వినోద్ ఖ‌న్నాలు, స‌న్నీ డియోల్ ఎంపీగా గెలుపొందారు. మరి యువ‌రాజ్ వాళ్ల లిస్ట్‌లో చేరుతాడా? అనేది మ‌రికొన్ని రోజుల్లో తెలియనుంది. క్రికెట‌ర్లు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మ‌న‌దేశంలో కొత్తేమీ కాదు. మాజీ ప్లేయర్స్ గౌతం గంభీర్, సచిన్ టెండూల్క‌ర్‌లు ప్ర‌స్తుతం ఎంపీలుగా కొన‌సాగుతున్నారు.