National Politics: మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ అస్వస్థత.. హాస్పిటల్ కి తరలింపు..

National Politics: Former President Pratibha Patil is sick.. shifted to hospital..
National Politics: Former President Pratibha Patil is sick.. shifted to hospital..

భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ అస్వస్థతకు గుర్యయారు. బుధవారం రాత్రి పుణెలోని భారతీ ఆస్పత్రిలో చేరారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రతిభా పాటిల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వైద్యుల బృందం వెల్లడించింది.

భారత్‌కు రాష్ట్రపతిగా పనిచేసిన తొలి మహిళగా ప్రతిభా పాటిల్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 2007 నుంచి 2012 వరకు ప్రతిభా పాటిల్ పదవిలో ఉన్నారు. అంతకుముందు 2004 నుంచి 2007 రాజస్థాన్లో గవర్నర్గా పనిచేశారు. 1991 లోక్సభ ఎన్నికలో ఎంపీగా గెలుపొందారు. ప్రతిభా పాటిల్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఆమెకు అవసరమైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ భర్త దేవీసింగ్‌ షెకావత్‌ (89) గతేడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు. పుణె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన గుండెపోటుతో మరణించారు.