కేంద్రం ఎన్నో స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీములతో చాలా మంది లాభాన్ని పొందుతున్నారు. రైతుల కోసం ఎన్నో స్కీమ్స్ వచ్చాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్రం రైతుల కోసం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా చాలా మంది రైతులు ప్రయోజనం ని పొందుతున్నారు. పీఎం కిసాన్ పథకం పెట్టుబడి సాయాన్ని పెంచనున్నట్లు తెలుస్తోంది.
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి మూడుసార్లు రూ. 2వేల చొప్పున మొత్తం రూ. 6వేలు రైతుల ఖాతాల్లో వేస్తోంది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 8వేలకు పెంచనుందట. రూ. 2వేల చొప్పున నాలుగు సార్లు ఇవ్వనుందని పలు జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. రాబోయే లోక్ సభ ఎన్నికలకు ముందే ఈ పెంపు ఉండే అవకాశం ఉందని తెలిపాయి. దీంతో పాటు పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మొత్తాన్ని కూడా పెంచే అవకాశం ఉందని పేర్కొన్నాయి.