తమిళ కథానాయకుడు విజయ్ దళపతి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. తమిళగ వెట్రి కళగం పేరిటా పార్టీ ప్రకటన చేశారు. తమిళనటుడు విజయ్ రాజకీయం చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తాజాగా ప్రకటన చేశారు. అవినీతి నిర్మూలన కోసమే తాను పార్టీ పెడుతున్నట్టు వెల్లడించారు విజయ్. పార్టీ జెండా అజెండాను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.
సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యం. మన ఐక్యతకు ప్రగతికి అవరోధాలు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదు. తమిళ ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు. సినిమాలకు నటుడు విజయ్ తాత్కాలిక విరామం. లోకేష్ కనగరాజ్ తో తీసే సినిమానే చివరిది.
గత కొద్ది రోజులుగా విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు వార్తలు విస్తృతమైన విషయము తెలిసింది. పార్టీ పేరు ఇదే అంటూ పలు సోషల్ మీడియా ఛానల్లో చాలా రకాల వార్తలు ప్రచురితమయ్యాయి వాటిని నిజం చేస్తూ విజయ్ ఇవ్వాలా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించారు. విజయ్ రాజకీయ ఎంట్రీ దేశ, తమిళ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరి.