National Politics: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్

National Politics: Hearing on Kavita's writ petition in the Supreme Court today
National Politics: Hearing on Kavita's writ petition in the Supreme Court today

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ సంఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన అరెస్ట్‌ పై సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన ప్రమేయం లేకపోయినా అక్రమంగా అరెస్ట్ చేశారని.. తన ప్రమేయంపై ఆధారాలు లేవని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌ను ప్రతివాదిగా చేర్చి MLC కవిత పిటిషన్ దాఖలు చేశారు.

మరి దీనిపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. తనను అరెస్ట్ చేయవద్దనే ఆదేశాలున్నా, ధిక్కరించి ఈడీ అరెస్ట్ చేసిందని కవిత తన పిటిషన్లో పేర్కొన్నారు. BRS MLC కవిత తరఫున రోహత్గా, కపిల్ సిబాల్ కోర్టులో వాదించనున్నారు. కాగా ఆమెను భర్త అనిల్, మాజీ మంత్రులు KTR, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి కలిశారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే అరెస్ట్ విషయంలో న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై చర్చించారు.