కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను తీసుకువచ్చింది కేంద్రం తీసుకువచ్చిన వాటిలో నేషనల్ పెన్షన్ స్కీం కూడా ఒకటి. తాజాగా నేషనల్ పెన్షన్ స్కీం రూల్ మారింది. ఖాతా తెరవడానికి కొత్త పద్ధతిని తీసుకువచ్చింది. ఇక దాని వివరాలను చూద్దాం. ఈజీగా ఎన్పీఎస్ అకౌంట్ తెరిచేందుకు అవకాశం ని ఇస్తోంది. పేపర్ లెస్, యూజర్ ఫ్రెండ్లీ పద్ధతిలో ఈజీగా ఎన్పీఎస్ ఖాతా ని తెరవచ్చు.
ఇప్పుడు ఇ-ఎన్పీఎస్ వినియోగించుకోవాలని ప్రభుత్వ నోడల్ ఆఫీసర్లకు చెప్పింది పెన్షన్ బాడీ పీఎఫ్ఆర్డీఏ. ఈ కొత్త పద్ధతి వలన ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి అని పీఎఫ్ఆర్డీఏ తెలిపింది. కొత్త వారిని ఆన్‌బోర్డింగ్ చేయడం ఈజీ. ఎన్పీఎస్ వివరాలను ప్రభుత్వ నోడల్ అధికారులు వెరిఫై చేయడం కూడా ఈజీనే. సరైన టైం కి PRAN జనరేట్ చేయవచ్చు కూడా. అలానే, ఎన్పీఎస్ కాంట్రిబ్యూషన్ ని కూడా డిపాజిట్ చేయవచ్చు. దీనిలో ఇ-సైన్ లేదా ఓటీపీ ద్వారా పేపర్ లెస్ ఎన్రోల్మెంట్ ఉంటుంది.