కాంగ్రెస్ మీద తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు ప్రధాని మోడీ. ఇక వివరాలను చూస్తే.. కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందని మోడీ అన్నారు. నెగిటివ్ ఆలోచనలతో ఉండే కాంగ్రెస్ పాజిటివ్ నిర్ణయాలు తీసుకోలేదు అని అన్నారు. కాంగ్రెస్ భవిష్యత్ గురించి ఊహించలేదు, రోడ్డు మ్యాప్ గురించి ఆలోచించలేదు అని మోడీ అన్నారు.
ఈ కారణంగానే కరెంట్ విషయం లో కాంగ్రెస్ అపఖ్యాతి మూటగట్టుకుందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కోతల వల్ల దేశవ్యాప్తంగా చాలా చోట్ల గంటల కొద్దీ అంధకారం ఉండేది అని అన్నారు మోడీ. కరెంట్ కొరత ఉంటే ఏ దేశం అభివృద్ధి సాధించలేదు అని ప్రధాని మోడీ అన్నారు.