National Politics: ప్రధాని మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ

National Politics: Rahul Gandhi made sensational comments on Prime Minister Modi
National Politics: Rahul Gandhi made sensational comments on Prime Minister Modi

ప్రధాని మోడీ లోక్ సభ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ‘లోక్ తంత్ర బచావో’ పేరిట నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేశారన్నారు. విపక్ష బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్, నేతలను అరెస్ట్ చేయడం ద్వారా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.

మోడీ ఒక్కరే ఈ నిర్ణయాలు తీసుకోవడం లేదని.. ఐదురుగు ధనిక మిత్రులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసమే తమ పోరాటం అన్నారు. దేశంలో అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ధనికులు.. ధనికులుగానే ఉంటున్నారని.. పేదలు… పేదలుగానే ఉంటున్నారని మండిపడ్డారు.