National Politics: బిల్కిస్ బానో దోషులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

National Politics: Sensational verdict of Supreme Court.. 30 years imprisonment in sexual assault case..!
National Politics: Sensational verdict of Supreme Court.. 30 years imprisonment in sexual assault case..!

బిల్కిస్ బానోపై అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై నమోదైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. ఆ దోషులకు గుజరాత్ సర్కార్ ప్రసాదించిన క్షమాభిక్షను రద్దు చేసింది. క్షమాభిక్ష ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ఈ అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది.

దోషికి సంబంధించిన విచారణ, జైలు శిక్ష విధింపు ఎక్కడైతే జరిగిందో అక్కడే క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్​తో కూడిన అత్యున్నత ధర్మాసనం ఇవాళ తీర్పు చెప్పింది. క్షమాభిక్ష నిర్ణయంపై పునరాలోచన చేయాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు చెల్లవని స్పష్టం చేసింది. అనేక విషయాలను బహిర్గతం చేయకుండా ఆ ఉత్తర్వులు సంపాదించుకున్నారని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.