చట్టసభల్లో లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. ఎంపీ, ఎమ్మెల్యేల కేసులో ఇవాళ కీలక తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు ధర్మాసనం.
చట్టసభల్లో లంచం కేసుల్లో ఎంపీలు,ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని…చరిత్రాత్మక తీర్పు వెలువరించింది రాజ్యంగ ధర్మాసనం. గతంలో 1998 లో 5 గురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఏకగ్రీవ తీర్పు వెలువరించింది రాజ్యంగ ధర్మాసనం. అసెంబ్లీ పార్లమెంట్ లో లంచాలకు పాల్పడే ప్రజా ప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు ధర్మాసనం.