National Politics: ఈసారి కూడా అక్కడి నుండే పోటీ చేయనున్న రాహుల్ గాంధీ

National Politics: This time also Rahul Gandhi will contest from there
National Politics: This time also Rahul Gandhi will contest from there

మరి కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికలకు 36 మందితో తొలి జాబితా ప్రకటించింది. ఇక కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మరోసారి వయనాడ్ (కేరళ) నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.

గురువారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీపీ నేత సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ల నేతృత్వంలో పార్టీ ‘కేంద్ర ఎన్నికల కమిటీ’ సమావేశమై తెలంగాణ, కర్ణాటక, హరియాణ, మేఘాలయ, సిక్కిం, కేరళ, త్రిపుర, డిల్లీ, మణిపుర్‌ రాష్ట్రాల్లోని అభ్యర్థులను ఖరారుచేసే అంశంపై కసరత్తు చేసింది. ఇందులో తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన మినిస్టర్స్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ ,సీనియర్‌ నేతలు అధీర్‌రంజన్‌ చౌధరి,జైరాం రమేశ్‌, అంబికాసోని, ముకుల్‌వాస్నిక్‌, టీఎం సింగ్‌దేవ్‌ తదితరులు పాల్గొన్నారు.