న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు . నూతన డైరెక్టర్ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తూ ఉంది . ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ అన్ని మూవీ ల పై మంచి క్యూరియాసిటిని పెంచేశాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 7న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా హాయ్ నాన్న ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు నాని. వరుస ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలలో పాల్గొనడమే కాకుండా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు . ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు. అలాగే సినీ పరిశ్రమలో హీరోలతో తనకున్న అనుబంధం.. స్నేహం, తన నెక్ట్స్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. హాయ్ నాన్న సినిమాలో శ్రుతిహాసన్ తో సన్నివేశాలు ఉండవని.. కేవలం సాంగ్ మాత్రమే ఉంటుందని అన్నారు. అదే ఒడియమ్మా సాంగ్ అదిరిపోతుందని అన్నారు.
అలాగే మీపై నెగిటివిటీ వచ్చిన సమయంలో ఎలా ఫీలవుతారు ? అని అడగ్గా.. ప్రేమాభిమానాలు ఎక్కువయ్యే కొద్దీ నెగిటివిటీ ఎదురవుతుందని.. అది కావాలి.. ఇది వద్దు అంటే ఎలా ? అని కూడా అన్నారు. ఈ క్రమంలోనే తారక్ తో కలిసి ఉన్న ఒక అన్ సీన్ పిక్ షేర్ చేయాలని ఒక నెటిజన్ కోరగా… వెంటనే నాని ఒక ఫోటోను షేర్ చేస్తూ.. ఇది ఓకేనా అని కామెంట్ పెట్టారు. అందులో తారక్, నాని ఒకరికొకరు గట్టిగా హత్తుకుని ఎంతో సంతోషంగా కనిపిస్తు ఉన్నారు . అయితే చాలా కాలం తర్వాత వీరిద్దరిని ఇలా చూసిన ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు.