Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రస్తుతం యుద్దప్రాతిపదికన సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు తక్షణమే నిలపివేయాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ కు లేఖ రాశారు. ఒడిసాతో తేలాల్సిన చర్చలు తేలకుండానే పోలవరం నిర్మాణం పూర్తయితే ఒడిశాకు చెందిన వేలాది గిరిపుత్రులకి శాశ్వత నష్టం జరుగుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇదే విషయం మీద ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రెండుసార్లు లేఖ రాశానని తెలియజేశారు. శబరి, సీలేరు నదీ జలాల విషయం తేలకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం గోదావరి జలాల ట్రైబ్యునల్ నిబంధనలను అతిక్రమించడమేనని ఆయన ఆరోపించారు. పునరావాసం, జలాల పంపిణీ వంటి అంశాలు తేలేవరకు పోలవరం పనులు ఆపాలని ఆయన కోరారు. అయితే కాగా, పోలవరం ప్రాజెక్టుకు కొందరు ఇబ్బందులు పెడుతున్నారని, కేంద్రం నిధులు ఇవ్వకపోయినా 55 శాతం పనులు పూర్తి అయ్యాయిని పోలవరం ఏపికి జీవనాడి అని ఏపి సియం చంద్రబాబు ఈ రోజు వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు అభ్యంతరం చెప్పని ఒడిశా నుంచి ఒక్కసారిగా అభ్యంతరాలు రావడం చర్చనీయాంశంగా మారింది.
దేశమంతా కూటములు, 2019 ఎన్నికల గురించి చర్చ జరుగుతున్న వేళ నవీన్ పట్నాయక్ ప్రయత్నాలతో రాజకీయం కొత్త మలుపు తీసుకోబోతోందా ? అని విశ్లేషకులు భావిస్తున్నారు. నవీన్ పట్నాయక్ కారణంగా ప్రణబ్ ముఖర్జీ, ఆడ్వాణీ ఒక్క చోట కలిశారు. మూడో కూటమి ముచ్చట్లు వినిపిస్తున్న వేళ.. నవీన్ పట్నాయక్ ఏర్పాటు చేసిన లంచ్ చర్చనీయాంశమైంది. 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ విభేదిస్తూ వచ్చిన ఆడ్వాణీ, ప్రణబ్ ముఖర్జీ కలవడం తో వారిద్దరూ ఏం చర్చించుకున్నారు..? ఈ పరిణామం ఎలాంటి రాజకీయ ప్రకంపనలకు కారణం కాబోతోంది..? అన్న చర్చ గత కొద్ది రోజులుగా సాగుతోంది అయితే ప్రణబ్, ఆడ్వాణీతో పాటు దేవెగౌడ కూడా కనిపించడంతో.. రాజకీయం ఎలాంటి మలుపు తీసుకోబోతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ చంద్రబాబు మూడో కూటమి విషయంలో లీడ్ తీసుకుంటారని అనుకుంటే ఈ పోలవరం అంశం పెట్టి చంద్రబాబుని వెనక్కి లాగే ప్రయత్నం నవీన్ పట్నాయక్ చేయవచ్చునని అందుకే ఇప్పుడు ఇంత హడావిడిగా ఆయన లేకః రాయడం వేనుక కారణాలు ఏమిటా అనేది తేలాల్సి ఉంది.