పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇటీవల నియమితులైన నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. పంజాబ్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్.. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇటీవల నియమితులైన కుల్జీత్ సింగ్ నగ్రా, సంగత్ సింగ్ గిల్జియన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సిద్ధూ, అమరీందర్ సింగ్‌తో పాటు మరికొందరిని పార్టీ నేతలు గజ మాలలతో సన్మానించారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం సభను ఉద్ధేశిస్తూ ఆయన మాట్లాడారు. కుర్చీలోంచి పోడియం దగ్గరకు వెళుతున్నపుడు స్టేజిమీద తన బ్యాటింగ్ స్టైల్‌ను అనుకరించారు. అనంతరం తల్లిదండ్రుల కాళ్లకు మొక్కి పోడియంను చేరుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.