‘గాడ్ ఫాదర్’ టీమ్ ఫుల్ జోష్‌తో ‘అప్ అప్ ర్యాప్ అప్’ అంటోంది. ఎందుకింత జోష్ అంటే అనుకున్నట్లుగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను ర్యాప్ అప్ చేశారు. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘గాడ్ ఫాదర్’.
కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ ముగిసింది. ఈ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు మోహన్ రాజా, హీరోయిన్ నయనతార ఫోటోను షేర్ చేసింది చిత్రబృందం. ‘‘పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తారు. నయనతార పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది’’ అన్నారు.