‘‘రహస్యంగా పెళ్లి చేసుకోను’’ అంటున్నారు నయనతార. విఘ్నేష్‌శివన్, నయనతారల పెళ్లి గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వస్తుంటుంది. కానీ ఇప్పటివరకు విఘ్నేష్‌శివన్, నయనతారలు తమ పెళ్లి గురించి బహిరంగంగా మాట్లాడింది లేదు. తొలిసారి పెదవి విప్పారు నయనతార.
ఇటీవల ఓ తమిళ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి నయనతార మాట్లాడుతూ – ‘‘మా (విఘ్నేష్, నయన్) ఇద్దరి కుటుంబసభ్యుల సమక్షంలో మా నిశ్చితార్థం జరిగింది. పెద్దగా సంబరాలు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే నిశ్చితార్థం జరుపుకున్నాం.
మా వివాహ తేదీ ఇంకా ఖరారు కాలేదు. ముహూర్తం ఫిక్స్ అయిన వెంటనే నా ఫ్యాన్స్‌కి చెబుతాను. రహస్యంగా పెళ్లి చేసుకోను. వృత్తిపరంగా మా గోల్స్‌ను సాధించే పనిలో మేం బిజీగా ఉండటం వల్లే ఇప్పటివరకు పెళ్లి గురించి సరైన నిర్ణయం తీసుకోలేదు. విఘ్నేష్ నా బాయ్‌ఫ్రెండ్ స్టేజ్ దాటి పోయాడు. ఆయన నాకు కాబోయే భర్త. మీడియా కూడా ఇకపై వారి కథనాల్లో ఇలాగే రాస్తారని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.