మలయాళ థ్రిల్లర్‌లో లేడీ సూపర్‌ స్టార్

మలయాళ థ్రిల్లర్‌లో లేడీ సూపర్‌ స్టార్

నయనతార లేడీ సూపర్‌ స్టార్‌. వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో ఎప్పుడూ వెలుగులోనే ఉంటారు. కానీ నయనతార నీడలో ఉండిపోబోతున్నారట. అయితే ఇదంతా సినిమా కోసమే. నయనతార తాజాగా మలయాళంలో ఓ సినిమా కమిటయ్యారు. ‘నిళల్‌’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మలయాళ థ్రిల్లర్‌లో హీరోయిన్‌గా నటించనున్నారామె. కున్చాచ్కో బోబన్‌ హీరోగా కనిపిస్తారు. అప్పు యన్‌. బట్టాత్తిరి దర్శకత్వం వహిస్తారు.

నేటి నుంచి ఈ సినిమా చిత్రీకరణ కేరళలో ప్రారంభం కానుందని తెలిసింది. ప్రస్తుతం నయనతార చేతిలో ఉన్న సినిమాల చిత్రీకరణలన్నీ కోవిడ్‌ వల్ల బ్రేక్‌లో ఉన్నాయి. తక్కువ మంది యూనిట్‌ సభ్యులు, తక్కువ రోజుల్లో ‘నిళల్‌’ సినిమా చిత్రీకరణ ను ప్లాన్‌ చేశారు. సినిమా పూర్తయ్యే వరకూ ఏకథాటిగా షూటింగ్‌ జరగనుందని తెలిసింది. నయనతార పోషించే పాత్ర సినిమాకు చాలా కీలకమని, నయనతారే ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారని చిత్రబృందం తెలిపింది.