బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఓ రకంగా సినిమాలకు దూరమయ్యారనే చెప్పొచ్చు. వరుస ఫ్లాపులు, డిజాస్టర్లతో సతమతమైన షారుక్ దాదాపు రెండు మూడేళ్ల పాటు దూరంగా ఉన్నారు. ఈ మధ్యలో షారుక్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూనే వచ్చారు. ఫ్యాన్స్ నిత్యం సినిమాల గురించి అడుగుతుండట.. త్వరలోనే అంటూ షారుక్ కూడా తప్పించుకుంటూ వచ్చారు. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సినిమా ఉంటుందనే టాక్ గత రెండేళ్ల నుంచి వస్తూనే ఉంది.
నేడు ఆ రూమర్లే నిజమైనట్టు తెలుస్తోంది.షారుక్ అట్లీ దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ షూటింగ్ పుణెలో ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీ అత్యంత భారీ ఎత్తున అట్లీ తెరకెక్కించనున్నాడని టాక్. దీనికి పూర్తిగా సౌత్ ఫ్లేవర్‌ను అద్ది ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా మలిచే పనిలో ఉన్నట్టు సమాచారం. అందుకే షారుక్ మినహా మిగతా వారిలో ఎక్కువ మందిని సౌత్ నుంచి తీసుకున్నట్టు తెలుస్తోంది.
షారుక్ పక్కన నయనతార నటించనుంది. ఇక ముఖ్యమైన పాత్రలో ప్రియమణి కూడా నటించనున్నారు. కమెడియన్‌గా యోగిబాబు ఫిక్స్ అయ్యారట. విలన్‌గా రానాను తీసుకునే యోచనలో ఉన్నారని టాక్. ఇక దాదాపు పది రోజుల పాటు ఈ షూటింగ్ జరగనుందని, ఆ తరువాత రాజ్ కుమార్ హిరాణీ మూవీ సెట్‌లో షారుఖ్ అడుగుపెట్టనున్నారట. కానీ అట్లీ మాత్రం మిగతా సీన్లు తీస్తూ బిజీగానే ఉండబోతోన్నారని తెలుస్తోంది.