“NBK 109” గ్లింప్స్ టీజర్ అదుర్స్ ….!

“NBK 109” Glimpses Teaser Reveals ....!
“NBK 109” Glimpses Teaser Reveals ....!

టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన గత మూడు మూవీ లు తన కెరీర్ లో సెన్సేషనల్ హిట్స్ కాగా ఈ మూవీ ల తర్వాత మరో హ్యాట్రిక్ కొట్టే విధంగా దర్శకుడు బాబీ తో బాలయ్య తన కెరీర్ 109వ మూవీ ని అయితే అనౌన్స్ చేశారు. మరి ఇది అనౌన్సమెంట్ తోనే సాలిడ్ బజ్ ను అందుకోగా నెక్స్ట్ వచ్చిన అప్డేట్స్ కూడా మంచి మంచి అంచనాలను రేకెత్తించాయి.

“NBK 109” Glimpses Teaser Reveals ....!
“NBK 109” Glimpses Teaser Reveals ….!

ఇక ఈరోజు బాలయ్య బర్త్ డే కానుకగా మేకర్స్ క్రేజీ ట్రీట్ ను ఈరోజు అందిస్తున్నట్టుగా ఫిక్స్ చేశారు. మరి చెప్పినట్టుగా ఆన్ టైం లోనే ఈ అప్డేట్ వచ్చేసింది. మరి ఈ టీజర్ మాత్రం బాలయ్య అభిమానులకి మంచి ట్రీట్ ఇచ్చేలా ఉందని చెప్పాలి. బాలయ్య పై మాస్ ఎలివేషన్ ఇస్తూ మకరంద దేశ్ పాండే పలికించిన డైలాగ్ లు ఫ్యాన్స్ కు ఊపు తెప్పించేలా ఉన్నాయని చెప్పాలి.

జాలి, దయ, కరుణ లేనటునటువంటి ఒక అసురుడు అని అంటూ బాలయ్యపై వేసిన ఎలివేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నది . ఇక లాస్ట్ లో గుర్రంతో బాలయ్య సీక్వెన్స్ అదిరింది అని చెప్పుకోవాలి . ఇంకా థమన్ ఇచ్చిన స్కోర్ కూడా ఇందులో బాగుంది. మొత్తానికి అయితే ఫ్యాన్స్ కు మాత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ వారు మంచి ట్రీట్ ను అందించారు.