‘ఇడియట్‌’ పూరి నీకేమైంది?

negative talk on mebooba movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

డాషింగ్‌ డైరెక్టర్‌గా పేరున్న పూరి జగన్నాధ్‌ ఈమద్య గతి తప్పుతున్నాడు. తన మార్క్‌ను చూపించడంలో విఫలం అవుతున్నాడు. భద్రి, పోకిరి, ఇడియట్‌ వంటి అద్బుతమైన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలను తెరకెక్కించిన పూరి జగన్నాధ్‌ ఈమద్య పైసా వసూల్‌ వంటి చెత్త సినిమాలు తెరకెక్కించాడు. పూరి ఎన్ని ఫ్లాప్‌లు చేసినా కూడా ఆయనపై ఇప్పటి వరకు నమ్మకం ఉండేది. ఆ నమ్మకంతోనే తాజాగా ఆయన తెరకెక్కించిన ‘మెహబూబా’ చిత్రంపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ సినిమా అంచనాలను తల కిందులు చేసింది. పూరి తన మార్క్‌ను ఈ చిత్రంలో కూడా చూపించక పోవడంతో ఆయన ఫ్యాన్స్‌ మరియు సినీ వర్గాల వారు, ప్రేక్షకులు అంతా కూడా తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

తన కొడుకు ఆకాష్‌ పూరి కోసం స్వయంగా నిర్మాతగా మారి పూరి ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. తాను ఈ సినిమాను ఒక కొత్త దర్శకుడిగా తెరకెక్కించాను అని, తన మార్క్‌ సినిమాగా ఉంటుందని సినిమా విడుదలకు ముందు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. కాని ఆ మార్క్‌ ఎక్కడ కనిపించలేదు. పూరి జగన్నాధ్‌ సినిమాల ఇది అనిపించలేదు. ఏమాత్రం ఆకట్టుకోని కథనం, కథ, డైలాగ్స్‌ సినిమాకు మొదటి రోజే డిజాస్టర్‌ టాక్‌ను తెచ్చి పెట్టాయి. పూరిపై ఆశలు పెట్టుకుని వచ్చిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాద్‌ తన ట్రేడ్‌ మార్క్‌ను కోల్పోయాడని, ఆయనకు ఎలాంటి సినిమాు తీస్తున్నాడో ఆయనే అర్థం కావడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇడియట్‌, పోకిరి వంటి సినిమాలు తెరకెక్కించిన పూరి ఎందుకు ఇలాంటి చెత్త సినిమాలు చేస్తున్నాడు అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తన పాత మార్క్‌ సినిమాలను పూరి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. తన తదుపరి చిత్రాన్ని కూడా కొడుకుతోనే తీయాలని భావిస్తున్న పూరి ఎలాంటి కథను ఎంచుకుంటాడో చూడాలి. దాంతో అయినా ఆకట్టుకుంటాడేమో చూడాలి.