Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నిజానిజాలు బేరీజు వేసుకోకుండా తప్పుడు వార్తలు వ్రాసి పబ్లిష్ చేస్తున్న వెబ్ సైట్లు నిఖార్సైన జర్నలిస్ట్ లమయిన మా పరువు తీస్తున్నాయని పేర్కొంటూ అలా తప్పుడు వార్తలు వ్రాసిన కొన్ని వెబ్సైటుల మీద, అలాగే కొన్ని టీవీ చానళ్ల పరువు, ప్రతిష్టల్ని దెబ్బతీసే విధంగా తన ట్విట్టర్ లో పిలుపునిచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా నిన్న జర్నలిస్టు సంఘాలు పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కు రెండు వేర్వేరు ఫిర్యాదులు అందాయి. అందులో ఒకటి తెలంగాణ లోకల్ జర్నలిస్టుల సంఘం చేసిన ఫిర్యాదు కాగా, మరొకటి టీవీ5 క్రైం రిపోర్టర్ మరో ఫిర్యాదు చేసారు. పవన్ కళ్యాణ్ తో కుమ్మక్కైన పలు వెబ్ సైట్లు టీవీ9, ఏబీఎన్, టీవీ5 ఛానెళ్ల ప్రతిష్టను దెబ్బతీసేలా ఫోర్జరీ చేసిన వీడియోని పోస్ట్ చేశాయంటూ జర్నలిస్టులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారని తెలుస్తోంది.
తెలుగు.సమయం.కామ్, ఏపీన్యూస్‌కార్నర్.కామ్, ఓన్లీ4మెగాఫ్యాన్స్.కామ్, తెలుగువెబ్‌దునియా.కామ్, దండోరా.కామ్, జనంమనం.కామ్, సినీస్టాన్.కామ్ అనే వెబ్ సైట్లు సదరు తప్పుడు ప్రచారానికి పాల్పడ్డాయని ఆరోపిస్తూ జర్నలిస్టులు వారి మీద ఫిర్యాదు చేశారు. అలాగే పవన్ మీడియా అధినేత ఫోటోలను పోస్ట్ చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని వివరాలతో సహా కమిషనర్ కి అంధ చేశారు. పవన్‌కళ్యాణ్ పై నటి శ్రీరెడ్డి చేసిన అసభ్య వ్యాఖ్యల్ని సదరు ఛానళ్లు బీప్ సౌండ్ వేసి మాత్రమే ప్రసారం చేశాయని పదేపదే చెప్పినా పవన్ అనుచరులు, ఫ్యాన్స్ ఇంటర్‌నెట్‌లో మీడియా పై అసభ్య కర రీతిలో కామెంట్లు చేస్తూ దాడి చేస్తున్నారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ జర్నలిస్టులు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్… నిపుణుల కమిటీని నియమిస్తున్నామని, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.