నాగ చైతన్యతో విడిపోయినప్పటీ నుంచి సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నారు. విడాకుల ప్రకటన అనంతరం తను ఏం చెప్పాలనుకున్నా ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే వెల్లడిస్తున్నాయి. ఇక తన బాధను, భావోద్యేగాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చెప్పింది అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా తన ప్రస్తుత కండిషన్‌ను చెప్పే ప్రయత్నం చేస్తున్నారామే.
దీంతో సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ప్రతి పోస్ట్ చర్చనీయాంశం అవుతోంది. అంతేగాక తన నెక్ట్ పోస్ట్ ఏంటీ, ఈ సారి ఆమె ఎలా స్పందించబోతున్నారు? అని ఫ్యాన్స్, ఫాలోవర్స్‌లో కూడా ఆసక్తి నెలకొంది. ఇంకా చెప్పాలంటే తను పెట్టే పోస్టులే పరోక్షంగా చై-సామ్ విడాకులకు కొంత క్లారిటీ ఇస్తున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా సామ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక నుంచి తను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయం తీసుకున్నారట. అలాగే తన సామాజిక మాధ్యమాల అకౌంట్లను కూడా డిలీట్ చేయాలనుకున్నట్లు వినికిడి. ఆమె తాజా నిర్ణయం విని ఫ్యాన్ష్ అంతా ఆందోళన చెందుకున్నారు. ఇదిలా ఉంటే తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత మూడు యూట్యూబ్ ఛానళ్లపై ఇటీవల పరువు నష్టం దావా కేసు వేసిన సంగతి తెలిసిందే.
దీనిపై ఆమె కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయిస్తూ యూట్యూబ్ ఛానల్‌పై పిటిషన్ దాఖలు చేశారు.ఇక ఈ కేసును విచారించిన కోర్టు సదరు యూట్యూబ్ ఛానళ్లు వెంటనే సమంతకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని తీర్పునిచ్చింది. అలాగే సమంత కూడా తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదని కూడా ఆదేశించింది. దీంతో తీర్పు మేరకు సామ్ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.
మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే సామ్ స్పందించే వరకు వేచి చూడాలి. అయితే విడాకుల తర్వాత సమంతకు సోషల్ మీడియాలో కొంత నెగిటివిటి పెరిగింది. తను పెట్టే ప్రతి పోస్ట్‌పై కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుంటే మరికొందరూ ఆమెను అదే పనిగా ట్రోల్ చేస్తున్నారు.