ప్రముఖ గాయని నేహా కక్కర్ పంజాబీ గాయకుడు, నటుడు రోహన్‌ప్రీత్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేనప్పటికి అక్టోబర్‌లోనే వీరి వివాహం జరగనుందని బీటౌన్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నేహా గతంలో చాలా మందితో డేటింగ్లో ఉన్నట్లు కథనాలు ఉన్నాయి. గత సంవత్సరం ఇండియన్ ఐడల్ 10 హోస్ట్ ఆదిత్య నారాయణ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు చెప్పగా, అది పీఆర్ స్టంట్ అని తేలింది. దీనికి ముందు, నేహా, నటుడు హిమాన్ష్ కోహ్లీ రిలేషన్లో ఉన్నట్లు కథనాలు బయటకు వచ్చాయి. అప్పట్లో ఈ విషయం చాలా మందిని ఆకర్షించింది.
నేహా వివాహానికి సంబంధించి పుకార్లు రావడంతో ఈ విషయం గురించి హిమాన్ష్ కోహ్లీని ప్రశ్నించగా రోహన్ ప్రీత్‌తో ఉన్న సంబంధం గురించి తనకు తెలియదని, కానీ ఆమె జీవితంలో ముందుకు సాగడంపట్ల తనకు ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. హిమాన్ష్ మాట్లాడుతూ, ‘నేహా నిజంగా వివాహం చేసుకుంటే, నేను సంతోష పడతాను. దాని తరువాత ఆమె జీవితంలో ముందుకు సాగుతోంది, ఆమెకంటూ ఒకరుంటారు. అది చూడటానికి చాలా బాగుటుంది’ అని అన్నారు. ఇక నేహాను వివాహం చేసుకోబోతున్న రోహన్‌ప్రీత్ తెలుసా అని అడిగినప్పుడు, లేదు, నిజంగా తెలియదు అని హిమాన్ష్ సమాధానం ఇచ్చారు. హిమాన్ష్, నేహా కక్కర్ 2014 నుంచి 2018 వరకు 4 సంవత్సరాలు సంబంధంలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఒక మ్యూజిక్ వీడియోలో కూడా కలిసి నటించారు. ఒక రియాలిటీ షోలో నేహా, హిమాన్ష్ పట్ల తనకున్న ప్రేమను కూడా ప్రకటించింది.