గందరగోళంలో రవితేజ హీరోయిన్‌

Malvika Sharma deleted her Injury Photo

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రవితేజ ప్రస్తుతం కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ‘నేలటికెట్‌’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా మాళవిక శర్మ నటిస్తోంది. తెలుగు ప్రేక్షకుల ముందుకు మొదటి సారి ఈ చిత్రంతో మాళవిక శర్మ రానున్న నేపథ్యంలో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే పీచర్స్‌ మాళవికలో ఎక్కువగా ఉన్నాయని తప్పకుండా ఆమె తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ జోరుగా సాగుతుంది. ఈ సమయంలోనే మాళవికకు షూటింగ్‌లో ప్రమాదం జరిగిందని, ఆమెకు గాయం అయ్యింది అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది.

మాళవిక శర్మకు ప్రమాదం విషయం అబద్దం అని, ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, నిక్షేపంగా షూటింగ్‌లో పాల్గొంటుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్రకటించాడు. ఇదే సమయంలో మాళవిక సోషల్‌ మీడియాలో గాయంతో ఉన్న ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. చిన్న గాయంను కూడా పెద్దదిగా ప్రచారం చేస్తారనే ఉద్దేశ్యంతోనే చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ విషయాన్ని దాటవేశారు. కాని ఆమె ఫొటోను పోస్ట్‌ చేయడంతో యూనిట్‌ సభ్యులు షాక్‌ అయ్యారు. వెంటనే ఆ ఫొటోను తీసేయాల్సిందిగా మాళవికకు యూనిట్‌ సభ్యులు సూచించడం, ఆ వెంటనే ఆమె తీసేయడం జరిగింది. మొత్తంగా సోషల్‌ మీడియాలో, చిత్ర యూనిట్‌ సభ్యులతో ఎలా వ్యవహరించాలో తెలియక మాళవిక శర్మ గందరగోళంకు గురి అవుతున్నట్లుగా తెలుస్తోంది.