థియేటర్లు తెరుచుకోనున్నాయి

South Indian film industry Vs Digital Service Providers Issue Settled

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
గత అయిదు రోజులుగా సౌత్‌ ఇండియాలోని దాదాపు అన్ని సినిమా థియేటర్లు మూసే ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల ప్రదర్శన నిలిచిపోయింది. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు భారీ మొత్తాలను వసూళ్లు చేస్తున్న కారణంగా నిర్మాతల మండలి వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లతో నిర్మాతల మండలి సభ్యులు జరుపుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ శుక్రవారం నుండి థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉందని, నిర్మాతల మండలి డిమాండ్స్‌ నెరవేరబోతున్నాయట.

డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు చార్జీలను తగ్గించడంతో పాటు, నిర్మాతల పలు డిమాండ్స్‌కు సరే అన్నట్లుగా తెలుస్తోంది. ఆ కారణంగానే ఈ శుక్రవారం నుండి అన్ని థియేటర్లను యధాతదంగా ఓపెన్‌ చేయబోతున్నారు. వారం రోజుల పాటు పెద్ద సినిమాలు ఏమీ లేని కారణంగా టాలీవుడ్‌కు పెద్దగా నష్టం ఏమీ లేదు. తమిళం మరియు మలయాళంలో కూడా పరీక్షల సీజన్‌ వల్ల పెద్దగా నష్టం జరగలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు మరియు నిర్మాతల మండలి సభ్యులు త్వరలోనే సంయుక్త ప్రెస్‌మీట్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. రాతపూర్వకంగా హామీ ఇచ్చిన వెంటనే సినిమా థియేటర్లను ఓపెన్‌ చేయనున్నట్లుగా నిర్మాతలు చెబుతున్నారు. దాంతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలకు పెద్దగా ఇబ్బంది ఉండదు.