థియేటర్లు తెర్చుకున్నా ఫలితం లేదు

Theaters open But No use But No use
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్‌ జరిగిన విషయం తెల్సిందే. బంద్‌ కారణంగా అన్ని థియేటర్లు మూతపడ్డాయి. డిజిటల్‌ ప్రొవైడర్లకు మరియు నిర్మాతలకు జరిగిన చర్చలు సఫలం అవ్వడంతో నిన్నటి నుండి థియేటర్లలో ఆట పడుతుంది. ఇతర రాష్ట్రాల విషయం పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆట పడ్డ ఫలితం లేకుండా పోయింది. గత కొన్నాళ్లుగా పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో పాటు, నేడు విడుదలైన చిత్రాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. దాంతో సినిమా ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులు చూసేందుకు ఒక్క మంచి సినిమా కూడా లేదు. రెండు మూడు వారాల క్రితం విడుదలైన ‘తొలిప్రేమ’ మరియు ‘ఛలో’ సినిమాలు తప్ప ఒక్క సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేవి లేవు. దాంతో చేసేది లేక ఆ చిత్రానే మళ్లీ చూస్తున్నారు. ప్రస్తుతం పరీక్షల సీజన్‌ అవ్వడంతో పెద్ద సినిమాలను విడుదల చేయడం లేదు. కాని కొందరు మాత్రం సినిమాలు లేకపోవడంతో నిరాశను వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా తెలుగు ప్రేక్షకులకు సరైన సినిమానే లేదు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఒక్క బిగ్గెస్ట్‌ సక్సెస్‌ చిత్రం రాలేదు అంటే అతిశయోక్తి కాదు. సంక్రాంతికి వచ్చిన చిత్రాలు బొక్క బోర్లా పడ్డాయి. గణతంత్ర దినోత్సవం సందర్బంగా వచ్చిన చిత్రాలు ఫ్లాప్‌ అయ్యాయి. ఈ గ్యాప్‌ను ఫిల్‌ చేయాలంటే రామ్‌ చరణ్‌ రంగస్థలం రావాలని మెగా ఫ్యాన్స్‌ అంటున్నారు. ఇన్నాళ్లు ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు సుకుమార్‌ ఒక అద్బుతమైన సినిమాను అందించబోతున్నట్లుగా సినీ వర్గాల వారు కూడా నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.