పవన్‌ ఇంట విషాదంపై క్లారిటీ

Clarity on Pawan Kalyan Mother-in-Law dead Rumors

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గత రెండు రోజులుగా పవన్‌ కళ్యాణ్‌ మూడవ భార్య అన్నా లెజ్నోవ తల్లి అంటే పవన్‌ అత్తగారు మరణించారని, త్వరలోనే పవన్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు వెళ్లబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. అన్నా లెజ్నోవ తల్లి మరణంపై రేణు దేశాయ్‌ కూడా స్పందించి, తన సానుభూతిని తెలియజేసింది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఈ విషయం కాస్త పవన్‌ సన్నిహితుల వరకు వెళ్లడం, వారు ఈ విషయాన్ని కొట్టి పారేయడం జరిగింది.

పవన్‌ ప్రస్తుతం చాలా బిజీగా రాజకీయాలు చేస్తున్నాడు. ప్రత్యేక హోదా కోసం, పార్టీ నిర్మాణం కోసం కష్టపడుతున్నాడు. ఇలాంటి సమయంలో పిచ్చి పుకార్లు పుట్టించడం సమంజసం కాదని, ఇలాంటి పుకార్లు పుట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటే పవన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక పీఆర్‌ఓ మీడియాతో అన్నాడు. పవన్‌ ఇంట విషాదం ఏం జరగలేదని, అంతా మీడియా సృష్టి అంటూ ఆయన క్లారిటీ ఇచ్చాడు. అన్నా లెజ్నోవ తల్లి మరణ వార్తలు అన్ని పుకార్లే అని తేలిపోయింది.