కేదార్ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

కేదార్ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

ఐపీఎల్‌లో నిన్న కోల్‌కత్తా నైట్ రైడర్స్, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పేలవ బ్యాటింగ్ కారణంగా చెన్నై 10 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది. స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్‌కి వచ్చిన కేదార్ జాదవ్ జిడ్డు బ్యాటింగ్ కారణంగానే చెన్నై ఓటమిపాలయ్యిందని మనోడిపై నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. భయ్యా ఇది టెస్ట్ మ్యాచ్ కాదని కొందరు, అతడని వెంటనే జట్టులో నుంచి తప్పించాలంటూ పోస్టులు, మీంస్ చేస్తూ మరికొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

అయితే తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తాకు రాహుల్ త్రిపాఠి 81 పరుగులతో రాణించడంతో ఆ జట్టు 167 పరుగులు చేసింది. అయితే 168 పరుగుల స్వల్ఫ లక్ష్య ఛేదనలో చెన్నై పూర్తిగా తడబడింది. చివరి 21 బంతుల్లో 39 పరుగులు అవసరమైన దశలో క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్ టెస్ట్ మ్యాచ్‌లగా డిఫెన్స్ ఆడుతూ 12 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు.

దీంతో సమీకరణం చివరి 12 బంతుల్లో 36 పరుగులుగా మారిపోగా చివరి రెండు ఓవర్లలోనూ ఆరు బంతులు ఎదురుకున్న కేదార్ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే చివర్లో రవీంద్ర జడేజా హిట్టింగ్ చేసి 8 బంతుల్లో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఈ మ్యాచ్‌లో ధోనీ కూడా 12 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి మరోసారి పూర్తిగా విఫలమయ్యాడు.