జ్యోతిక‌పై నెటిజన్ల విమ‌ర్శ‌లు

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

netizens comments on jyothika over Naachiyaar movie

సాధార‌ణంగా పాత‌కాలం హీరోయిన్లు పెళ్లి కాగానే సినిమాల‌కు గుడ్ బై చెప్పేవారు. కొన్నాళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా..అక్క‌, అత్త‌, అమ్మవంటి ప‌ద్ధ‌తి గ‌ల పాత్ర‌ల్లో మాత్ర‌మే న‌టించేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లి త‌రువాతా హీరోయిన్ల‌కు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వారు హీరోయిన్లుగానే కొన‌సాగుతున్నారు. త‌మిళ న‌టి జ్యోతిక ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. సూర్య‌ను పెళ్లిచేసుకున్న‌త‌ర్వాత గృహిణిగా స్థిర‌ప‌డ్డ జ్యోతిక 36వ‌య‌నిదిలేతో రీఎంట్రీ ఇచ్చారు.

Jyothika-use-bad-words

ప్ర‌స్తుతం బాలా చిత్రం నాచియార్ లో జ్యోతిక పోలీస్ అధికారిణి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇందులో జీవీ ప్ర‌కాశ్ హీరోగా న‌టిస్తున్నారు. రెండు రోజుల క్రిత‌మే నాచియార్ టీజ‌ర్ విడుద‌ల‌యింది. టీజ‌ర్ లో జ్యోతిక ప‌లికిన డైలాగ్స్ నెట్ లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. టీజ‌ర్ చివ‌ర్లో జ్యోతిక డైలాగ్స్ అస‌భ్య‌క‌రంగా ఉండ‌డంతో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్ల నుంచి ఆమెపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది.

Jyothika-use-bad-words-on-N

సినిమాల్లో సీనియ‌ర్ అయిన జ్యోతిక ఇటువంటి సంభాష‌ణ‌లు చెప్పేందుకు ఎలా అంగీక‌రించిదని నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. జ్యోతిక‌తో ఇలాంటి డైలాగులు ప‌లికించినందుకు డైరెక్ట‌ర్ బాలాను కూడా విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌చారం కోసం ఇలాంటి చౌక‌బారు ఎత్తులు వేస్తున్నార‌ని, సెన్సార్ ఏం చేస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. సినిమా నుంచి సంభాష‌ణ‌ల తొల‌గించాల‌న్న డిమాండ్ పెరుగుతోంది. త‌మిళంలో ప్ర‌ముఖ హీరో సూర్య‌కు భార్య అయిన జ్యోతిక ఇలాంటి డైలాగులు చెప్ప‌డం స‌మాజానికి మంచి సంకేతాలు ఇవ్వ‌ద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో ప‌ద్ద‌తి గ‌ల పాత్ర‌ల్లో మాత్ర‌మే న‌టించాల‌ని నెటిజ‌న్లు స‌ల‌హాలిస్తున్నారు.