అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ట్రైలర్…!

VARMAA Official Trailer

తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తుండగా, తమిళంలో ‘వర్మ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. తమిళ రీమేక్ లో విక్రమ్ తనయుడు ‘ధృవ్’ హీరోగా నటిస్తుండగా బాలా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి, సూర్య చేతుల మీదుగా ఈరోజు ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయించారు.

ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. తెలుగులో విజయ్ దేవరకొండ లుక్ లోనే ధృవ్ కూడా కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తమిళంలోను ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనీ, ధృవ్ కెరియర్ కి ఈ సినిమా ఎంతో హెల్ప్ అవుతుందని విక్రమ్ భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.