23 బాషల్లో మోడి సినిమా…!

PM Narendra Modi Biopic Poster Launched In 23 Languages

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోది జీవిత చరిత్రను ఒమంగ్ కుమార్ పియం నరేంద్ర మోది పేరుతో రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం నుండి ఇటివల ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్సు రావడంతో సినిమాను ఇప్పుడు ఇండియాలో దాదాపుగా ఉన్న 23 బాషలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నరేంద్ర మోది పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు. దర్శకుడు ఒమంగ్ కుమార్ ఈ చిత్రాని మోది చిన్న తనంలో బాల్యం విధ్యాబ్యాసం, అక్కడినుండి ఎలాగా గుజరాత్ రాష్ట్రంలోని రాజకియలో కీలక పాత్ర పోషించాడు. ఏలా గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాడు. గుజరాత్ అభివ్రుధికి తోడ్పాడడు. సెంటర్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు, ఒంటరిగా పోరాడుతున్న బీజేపికి నరేంద్ర మోది ఏ విధంగా సహాయ పడ్డాడు అనేది కీలకంగా చూపించనున్నారు.

ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న నేపద్యంలో ఇండియాలోని అన్ని మారు మూల ప్రాంతాలో పియం నరేంద్ర మోది చిత్రాని విడుదల చెయ్యాలని చిత్రా బృందం ప్లాన్ చేస్తుంది. తెలుగులో కూడా బయోపిక్ ల జోరు కొనసాగుతుంది, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర బయోపిక్ లు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తున్నా ఎలక్షన్స్ లో ప్రముఖ పాత్రను పోషిస్తాయి అనడంలో ఏలాంటి సందేహం లేదు.ఇకా తమిళంలో కూడా జయలలిత బయోపిక్ రంగం సిద్దం అవ్వుతుంది. బాలీవుడ్ లో థాక్రే బయోపిక్ పేరుతో మరో సినిమా వస్తుంది. ఈ చిత్రంనుండి విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్సు వచ్చింది. మన్మోహన్ సింగ్ బయోపిక్ కూడా విడుదలకు సిద్దంగా ఉన్నది. రాజకీయనాయకుల బయోపిక్ ల పేరుతో సినిమాలు తీస్తూ కొంతైనా రాజకియలో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి.